29, సెప్టెంబర్ 2016, గురువారం

యోగా ప్రజల్లో కి

హాయ్ !    
అవునండి యోగా ప్రజల్లోకి వెళ్ళాలిసినంతగా వెళ్ళలేదు అనిపిస్తుంది.పట్టణ ప్రజలు కొంత అవగాహన తో అదో నిత్య కృత్యంగా చేసుకున్నారు .కానీ చిన్న చిన్న పల్లె టూర్లల్లో అందరికి తెలియదు తెలిసిన అవకాశాలు తక్కువ .చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా మందులు వాడుకుంటూ శరీరాన్ని మందులకు అలవాటు చేస్తున్నారు 35 సంవత్సరాలకే బీపీ షుగర్ ఇలా వ్యాధుల బారిన పడుతున్నారు . వీటి అన్నింటిని కొంతవరకు యోగా  తో కంట్రోల్ చేయవచ్చు కదా.కానీ వారికీ నేర్పించే వాళ్ళు తక్కువ ఊర్లలో ప్రభుత్వం కూడా యోగా గురించి బాగా చెప్తుంది .ఇంకా కొంచెం చొరవ తో ప్రతి ఊరికి  లేదా రెండు ప్రక్క ప్రక్క ఊర్లకి కలిపి ఒక యోగా  ట్రైనర్ ని వేస్తె బావుంటుంది ప్రజల్లో కొంతమేరకు అవగాహన ఉంది కనుక త్వరగా స్పందిస్తారు కొంత ఐనా మేలు జరుగుతుంది. అనుకుంటూ ఇక సెలవు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి