18, అక్టోబర్ 2012, గురువారం

వయస్సు మార్పు భారం

హాయ్ 
ఈరోజు నేను ఒక సినిమా  చూసాను హిందీ లో bhagban  అదేనండి తెలుగులో బడి పంతులు మన ఎన్టీఆర్ గారి సినిమా హిందీ లో అమితాబ్ నటించారు ఏముందండి movie ,అతను తన నలుగురు పిల్లల్ని పెంచుతూ మరల ఒక అనాధ ను కూడా పెంచుతారు నిజంగా అనిపిస్తుంది మనం కూడా అలా  చేయగలిగితే ఎంత బావుంటది అని .ఈ  సినిమా లో ఇప్పుడు బయట మనం చూస్తున్న ఒక సమస్య కనబడుతుంది తల్లి తండ్రులు సంతానాన్ని పెంచే టప్పుడు ఎటువంటి బేదం తెలియకుండా వారి కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారు వీల్లే జీవితం అనుకుంటారు వారి కోసం ఏమి ఆలోచించకోకుండా జీవితం మొత్తం  వీళ్ళ కోసమే బ్రతుకుతారు .వాళ్ళ కోసం వాళ్ళకి టైం వచ్చి నప్పుడు పిల్లలు మాత్రం అ ప్రేమ అ మర్యాద ఇవ్వగలుగుతున్నారా ఏమో అనే అనాలి వయసు మీరిన ఎంతో మంది పెద్దవారు వారి పిల్లల నుంచి ఎన్నో చీదరింపు లు చిత్కారాలు ఎదుర్కుంటున్నారు తల్లి తండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు ఏమి లాభం ఆశిస్తున్నారు ఏమి లేదు కానీ పిల్లలు వారినే చూసే సమయం వచ్చినప్పుడు ఏమి యిస్తారు అని అడుగుతారు ఏంటో ప్రపంచం ఎంతోమంది తల్లి తండ్రులు వృద్ద ఆశ్రమాలలో ఉంటున్నారు వయసు మీరిన సమయం లో . ఏమి పిల్లల్ని పెంచే టప్పుడు  పెద్దవారు  కూడా అనుకోవచ్చు  కదా మాకు అడ్డం so పిల్లలని అనాధ ఆశ్రమం వేరే దగ్గర వదలి వేద్దాం అని offcourse ఇప్పుడు అందరు బేబీ కేర్ సెంటర్స్ లో వదులుతున్నారు జాబు కోసం కానీ పాత రోజులు వేరు ఎంతో కష్ట పడి  పెంచుతారు కాని మనం కన్న వారి మీద చూపించే ప్రేమ మనల్ని కన్నా వారి మీద చూపలేక పోతున్నాం. అందుకే పెద్దవారు మీ  కోసం కూడా కొంచెం దాచుకోండి ఏది అయిన డబ్బు లేక ఆస్తి . సమయం, అంత ఎప్పుడు ఎలాఉంటుందో తెలియదు .ఎవరు అయినా పెద్దలు పెద్దతనం లో పిల్లల సహచర్యం ప్రేమ మర్యాద మాత్రమే కోరుకుంటారు  అది మనం ఇవ్వాలి వారికీ. రేపు మనం కూడా అ స్థితి కి వస్తాం.అని భావిస్తాను నేను bye 

12, అక్టోబర్ 2012, శుక్రవారం

విలాసాల చిక్కులు

హాయ్ ఈమధ్య కాలం లో మనకు మన జీవన సరళిలో చాల మార్పులు వచ్చాయి మన ఆర్దిక ఆదాయాలు పెరిగాయి .వెంటనే మన జీవన విదానాలు మారుతూ వస్తున్నాయి .కాలం తో పాటు మనం విలాస  వంత జీవితాలను గడుపుతున్నం.అంటే ఇల్లు దాటి బయటకు వెళ్ళకుండా అన్ని అవసరాలు  ఇంటికే వచ్చేలాగ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం .ఎంతో ఉల్లాస వంత జీవితాన్ని గడుపుతున్నం అమెరికా లు వెళుతున్నాం ఎన్నో సాదిస్తున్నాం .కాని ఎక్కడి వరకు ఈ  పరుగు ఎటు వెళ్తున్నాం ,ఎటు చుసిన ఆరోగ్య సమస్యలు అందరు యోగ  నడక అని ఎన్నో చేస్తున్నారు కానీ ఏమి లాభం అందరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ,కానీ పాత రోజులలో ఇవి  ఏమి లేవు ఎందుకని అప్పుడు వారికీ ఉన్నదానికి ఆనందం పరుగులు తీయాలి అని ఆశ లేదు .ఎవరి  పని వారు చేసుకుంటూ ప్రేమ తో పయనించే వారు ,అప్పట్లో పనికి రాని చెత్త అంత పంట పొలాల కి సేంద్రియ ఎరువు ల వాడుకునే వారు కానీ ఇప్పుడు వేరు .అలాగే ఎన్నో విదానాలు మనం అభి వృద్ది పేరు తో వదిలేసాం ,చూసుకుంటూ పోతే ఇంతకూ ముందు ప్రతి ఇంటి బయట ఖాలీ స్థలాలు ఉండేవి ఇంతక ముందు అక్కడ ఇంటికి కావలిసిన కూరగాయలు పండేవి అందరికి కానీ ఇప్పుడు ఎవరికి ఆ అవకాశం  లేదు అందరు బయట దొరికే కల్తి కూరగాయలు కొనాల్సిందే  అల ఎన్నో విదానాలు మన జీవితాల లో మార్పు వచ్చాయి ఉరుకుల పరుగుల జీవితాలు ఆందోళన కరమైన పరిస్థితి లు మనం గడుపుతున్నం కదా మనం అనిపిస్తూ ఉంటుంది మరల మనం అలా పాతా రోజులు గడప గలిగితే ఎంతబాగుంటది  కదా వీలు ఉన్నా వరకు మన సాదారణ జీవితం గడపటమే మంచిది అందరికి అనుకుంటాను నేను .bye     

8, అక్టోబర్ 2012, సోమవారం

తెలపగలరు

హాయ్ నా బ్లాగ్ చూసినవారికి చదివిన వారికీ ధన్య వాదములు ,కానీ నా పోస్ట్ లోని విషయాలు ఎలా ఉన్నాయ్ ఏమైనా సరి చేసుకోవాలా నచ్చుతున్నాయా లేదా  అనే విషయం తెలియ చేయండి please
bye 

అల్లుడి గారి పండుగలు

హాయ్ చాలా రోజుల తరువాత పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అన్ని పండుగలు వస్తున్నాయి  కదా అందరు వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళే పని లో ఉంటారు కదా.ఇక్కడ  ఒక  చిన్న విషయం పండగలకు అత్తగారు అల్లుడి గారి ని ఇంటికి పిలవటం మన సంప్రదాయం కదండీ .so అందరు ఎవరి వారి ని వారు పిలుస్తారు కానీ పాపం అల్లుడు లేని వారు అంటే కేవలం కొడుకులు మాత్రమే ఉన్నవారు ఏమి చేయాలి .కానీ ఎప్పుడు అందరు చిన్న విషయం ,పాత  రోజుల్లో అందరు కలిసి ఉండేవారు అంటే అమ్మ,నాన్న,ఇలా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కోడళ్ళు అత్త గారి ఇంట్లో నే ఉండేవారు అందువలన పండగ అంటే అత్తగారు పిలిచే వారు వెళ్ళే వారు  కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఉద్యోగాల పేరు తో బయటే ఉంటున్నారు కదా .అందరికి దూరం గా .ఇనా సరే పండుగ అంటే అత్త గారి ఇంటికి వెళ్దాం అంటారు ,మరి అబ్బాయి ని కన్నా వారి పరిస్థతి ఏంటి . అందుకే ఈతరం  వారు ఆలోచించకొండి అమ్మాయిలు ,అబ్బాయిలు ఎవరు అయినా అర్థం చేసుకుని పండగ అంటే ఎవరి తల్లి తండ్రులు అయినా ఒకటే అందరి దగ్గరి కి వెళ్లి అందరి ని తృప్తి పరచండి సరదాగా ఎంజాయ్  చేయండి చిన్న ఆలోచన మాత్రమే బాయ్