12, డిసెంబర్ 2023, మంగళవారం
ఏది మార్గదర్శకం
11, డిసెంబర్ 2023, సోమవారం
ఇతర దేశాల వైపు అడుగులు
అందరకి నమస్కారం ఎలాఉన్నారు మీరూ నేనూ బాగున్నాను. చాలా రోజుల తర్వాత వ్యాసం మొదలు పెట్టాను నేనూ ఈ మధ్య మా అమ్మ ఎప్పుడూ మాట్లాడిన వాళ్ల బాబూ ఆ దేశం వెళ్ళాడు వీళ్ళ పాప ఈ దేశం వెళ్ళింది అంటూ చెప్తూ ఉంది ఔను నిజమే కదా ముందు రోజుల్లో చదువు పూర్తి చేసి పెళ్ళి అయిన తరువాత వెళ్ళేవారు ఎక్కడో కొంతమంది చదువూ కోసం వెళ్ళేవారు అయితే ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చదువు కోవటానికి వెళ్తున్నారు మంచిదే కానీ ఎంత మంది పిల్లలు మరలా తిరిగి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అనేది ప్రశ్న తల్లి తండ్రీలు కూడా బాగా సంపాదిస్తారు కదా అని సర్డుకుపోతున్నరు నిజంగా కొన్ని కొన్ని పల్లెటూర్లలో ఇళ్లు అన్ని కాళీ ఎందుకు అంటే అందరి పిల్లలు పరాయి దేశం లో ఉంటున్నారు.పెద్దలు ఇక్కడే ఉంటారు డబ్బులు పంపిస్తారు వాళ్ళకి,ఇంతేనా జీవితం అనిపిస్తోంది వారిని చూస్తుంటే. ఆ పరాయి దేశంలో వాళ్ళు కావాలి అని అనుకునే విలాస జీవితం గడుపుతుంటారు అనేది తెలుసా ? వీరికీ అంటే లేదు అక్కడ ఎంతో జాగ్రత్త గా సర్డుకుంటే తప్ప వారు మన దేశము వచ్చి నప్పుడు విలాసం గ గడపలేరు .ఇది తెలియని వెనుక తరం వారు మరలా వెళ్ళటానికి ఎదురు చూస్తుంటారు కానీ ప్రపంచం లో అన్నిటికంటే భారత దేశం లోనే సంతోషం గ విలాసం గా గడపగలరు మన. అనుకున్న వారి మధ్య లో .పక్షకి రెక్కలు వచ్చి ఎగిరే టప్పుడు హద్దులు తెలియదు అలాగే పిల్లలు కూడా అంతే పిల్లలూ డబ్బు ఒక్కటే ప్రపంచం కాదు కాకూడదు . వారీ ప్రపంచం లో అన్ని ఉండాలి అమ్మ, నాన్న,తొడ పుట్టిన వారు ఉంటేనే జీవితం పూర్తి అయినట్టు అని నా అభిప్రాయం సెలవు