27, జూన్ 2012, బుధవారం

ఈ తరం ఆలోచన

హాయ్
ఈ  రోజు నాకు ఉదయం ఒక చిన్న ఆలోచన వచ్చింది .అది బ్లాగ్ లో పోస్ట్ చేద్దాం అని ఇలా వచ్చాను .ఏమిటి అంటే మనలో చాల మంది పుట్టబోయే  పిల్లల కోసం చాల అనుకుంటూ ఉంటారు కొంత మంది పుట్టిన తరువాత మరికొంతమంది పెద్ద వారు అయిన   తరువత రకరకాల ఆలోచిస్తూ ఉంటారు అవి  . అమ్మాయి కావాలి అని    అబ్బాయి కావాలి అని perticular  గా  అనుకునే వారికీ నా  ఈ  చిన్న  ఆలోచన ఎవర అయిన  girl లేక  , boy parents  తో ఉండేది మానసికంగాను శారీరకం గాను 15 year s  వరకు మాత్రమే అది నిజంగా ఒప్పుకోవలిసిందే మనం
 ముందు మనం బాయ్ ఐతే  చూద్దాం  ఒక సారీ  ఇంటి నుంచి అవుట్ సైడ్ వెల్లి పోయన  తరువాత ఎలా ఉంటారు అనేది మనకు తెలియదు ఒక 50% మాత్రమే parents  కి తెలుస్తుంది తరువాత చదువలు  జాబు ఇలా ఎన్నో రకాల కారణాలు వారికి parents కి  దూరం  ఉంటుంది ఈ   టైం వారు ఎంత వరకు parents  తో వారి ఆలోచనలు పంచు కుంటారు అనేది తెలియదు ఒక వేల ఏమైనా చెప్పిన అన్ని చెప్పలేరు.ఎంత స్నేహంగా   ఉండే parents  తో కూడా
ఏమో చెప్పలేం .అ తరువాత పెళ్ళి  అంటాం  ఎప్పుడు ఐతే  వేరే వ్యక్తీ వస్తారో అప్పుడు చుడండి వారు ఇరుఉరు  ఒక వయసు వారు కావచ్చు లేక తారతమ్యం ఉండచ్చు కానీ couple  ఇంకా వారి మద్య దాపరికాలు ఏమి ఉండవు కదా  అది ధర్మం కదా ఇ  విధంగా   తను అన్ని సహాయంగా  ఉంటుంది .ఇక మగవారు కూడా సహజం గానే వారితో అన్ని విషయాలు పంచ్కుంటారు కదా అప్పటికి తల్లి తండ్రులు కి కూడా వయసు అవుతుంది కానీ వారికీ లోటు తెలుస్తుంది మన కి ఏదో బాధ అది ఏంటి చెప్పలేరు ఎందుకు అంటే ఇదంతా లోకంలో సహజంగా జరుగుతుంది ఈ విదంగా కొడుకు తల్లి తండ్రులుకి mental గా physical గాను దూరం అవుతాడు  కానీ ఈ విషయం  లో చేయగలిగింది ఏమి లేదు .కాకపోతే మగవారు ఆడవారు అందరు కూడా వయసు అయిపోయే వారి కి కొంచెం ఆనందం గ ఉండేలాగా చూడటం అనేది భాద్యత .
ఇక  girl  తను 20y  నుండి పెళ్లి అనే బందం తో parents దూరం అవుతుంది ఇక అప్పుడు ఎవరూ parents కి దగ్గరగా ఉండరు అలాంటప్పుడు ఎవరు ఇన ఒకటే ఇప్పుడు అమ్మాయి ఇన జాబు చేస్తుంది money సంపాదిస్తుంది parents ని చూసుకుంటుంది  సో ఎవరు కూడా వీరూ  వారు అనే తారతమ్యం పెట్టుకోవద్దు ఇప్పుడు సమాజం మారింది దాని తో పాటూ  మనం మారాలి  ఆలోచనలు మారాలి  అని నా ఆభిప్రాయం కే  bye 

26, జూన్ 2012, మంగళవారం

ఆషాడ మాసం

హాయ్
ఈ రోజు కొంచెం కొత్తగా  ఆషాడ మాసం గురించి చూద్దాం మొన్నే మా ఫ్రెండ్ కి పెళ్ళి యింది  పాపం వాళ్ళ పెద్ద్దలు అందరు కలిసి అయిన కొద్ది రోజుల కి ఆషాడం అని మా ఫ్రెండ్ ని వాళ్ళ శ్రీ వారి ని దూరం చేసారు .ఇక చూడండి  ఇద్దరు ఆషాడ మాసాన్ని తిట్టుకుంటూ మద్యలో పెద్దల్ని కూడా కలిపి తిట్టుకుంటూ ఉన్నారు పాపం.
 అసలు ఎందుకూ  ఇలా ఒక రూలూ  అని మా మామ్మ గారిని అడిగాను నేను ఆవిడేమో ఏమో నే నాకు అంత అవగాహనా లేదు మరి అంది కానీ ఒక  విషయం చెప్పింది ఆషాడ మాసం లో గర్బవతి కనక ఐతే వారు march  లో delivery  అవతుంది  కదా అప్పుడు ఏమో summer  స్టార్ట్ కదా సో పిల్లలు కు కష్టంగా ఉంటుంది వారికీ టీకాలు  సరిగా అందవు  ఎమైన  జరగచ్చు కదా అందుకని newly  married  couple ని దూరం గ ఉంచుతారు అని చెప్పింది అనమాట .ఇంకో క విషయం ఏమిటి అంటి పూర్వం అమ్మాయి లు అత్త మామ joint ఫ్యామిలీ లో ఉండేవాళ్ళు అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళటం అంట easy కాదుకదా వారికీ ఏదో ఒక టైం కావాలి కదా అందుకని ఇది ఒక కారణం కావచు 
ఇంకా కొంత మంది అత్త కోడలు ఓకే చోట ఉండకూడదు అని,అత్త అల్లుడు ఒక చోట ఉండ కూడదు అని అంటారు ఇది అంతా  ఎంత నిజం కనుక అందరు scintific  కారణం  తెలుసుకుని తగిన జాగ్రత్త ల తో కలిసి ఉండచు అని నా  అబిప్రాయం 

25, జూన్ 2012, సోమవారం

మాల్ ల మాయాజాలం

హాయ్
బెంగుళూరు లో ఉండే వారికీ timepass కి ఏమైని చూడాలి వెళ్ళాలి అంటే టక్కున mind లో వచ్చే ఆలోచన mall కి వేలడం వెరే ఏమైనా చేయాలన్న పార్క్ లు అంటే walking కి వెళ్ళేవి తప్పfamiliy తో వెళ్ళేవి తక్కువే ఉన్నాయ్ ఎక్కడ  చుసిన బిగ్ బాజార్  ,total మాల్ ,మంత్రి మాల్ ఇలాగా మనకు దగ్గరగా అంటే ఎ ప్రాంతం వారు కి అక్కడే ఏదో ఒక మాల్ ఉంటుంది వెళ్ళటానికి so ఎవరు కూడా దూరం వెళ్లారు కదా .ఇలా మాల్ కి వెళ్ళిన మనకి లోపల అంతా shops ,బేకరీ కాఫీ డేస్ ఇలా ఇంకా kfc  వగయిరా  మనల్ని ఆహ్వానిస్తాయి పిల్లల కోసం మరి ఆడవారికేమో soch అంటూ saree  showroom మరియు బంగారం వజ్రాలు ఇలా మగువ మనసు దోచేవి చాలానే ఉన్నాయి
కానీ ఇలా వెళ్ళిన మనం చుసి ఉరికే రాము కదా ఏదో ఒకటి కొంటాం .కానీ ఇది ఎంతవరకు చెప్పలేము మనతో వచ్చిన మనవారి ప్యాకెట్ కాళి .
కానీ చుడండి timepass కి వెళ్లి ఎలా మనీ ఖర్చు చేస్తామో ఇదే నండి malls  మాయాజాలం కానీ ఇలా ఉంటె కష్టం కదా మన వారి హార్ట్ గట్టి చేసి తెసుకుని వెళ్ళాలి అమ్మాయిలు   ok
జాగ్రత్త boys malls కి వేల్లెటప్పుడు  ఆలోచించుకోండి ఒకసారి
ok  bye 

దృష్టి సోకడం నిజమే

దృష్టి సోకడం నిజమే
Drisht: Evil Eyes Causes Trouble


దృష్టి సోకడం లాంటివి మొదట్లో నాకు నమ్మశక్యంగా ఉండేవి కావు. ఇవన్నీ మూఢ నమ్మకాలు లేదా చాదస్తాలు అని కొట్టిపారేసేవాణ్ణి. కానీ ఒకసారి మా ఇంట్లో జరిగిన సంఘటన అవి కేవలం ఈ ఆచారాలు చాదస్తంతో కూడిన నమ్మకాలు కాదని నిరూపించింది.

మా అమ్మాయి శ్వేతకి మూడేళ్ళ వయసులో తెలిసినవారి ఇంటికి వెళ్ళాం. అక్కడ అందరూ ''పాప చాలా బాగుంది'' అంటూ ముద్దు చేశారు. కబుర్లు, కాలక్షేపాలు అయ్యాక, భోజనం గట్రా చేసి తిరిగి ఇంటికి వచ్చాం. శ్వేత ఏమీ తినలేదు సరికదా దారిపొడుగునా ఏడుపే. సరే, అక్కడ ఏమీ నచ్చలేదేమో, ఇంట్లో తినిపిద్దాం అనుకుంటే ఉహూ.. ఇంట్లోనూ ఏమీ తినకపోయింది. పైగా గుక్కపట్టి ఒకటే ఏడుపు. ఏమైనా నొప్పేమో అంటే అదీ చెప్పదు. భయమేసి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళాం.

డాక్టర్ ''ఏదయినా సరిపడని ఆహారం తిందేమో'' అని, ''ఒకవేళ పడిపోయిందా.. దెబ్బ తగిలిందా'' అని వివరాలు అడిగారు. మొత్తానికి అన్ని విధాలుగా పరీక్ష చేసి ఏవో మందులిచ్చారు. కానీ లాభం లేకపోయింది. శ్వేత ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇంతలో మా పక్కింటి మామ్మగారు ''ఏంటి.. పాప ఆ వరసన ఏడుస్తోంటే చోద్యం చేస్తున్నారా...'' అంటూ వచ్చారు.

''బంధువుల ఇంటికి వెళ్ళామని, పొట్ట బరువు చేసిందేమో అనుకోడానికి అక్కడ ఏమీ తినలేదు, డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళినా ప్రయోజనం లేకపోయింది'' అంటూ సంక్షిప్తంగా విషయమంతా చెప్పాం.

''పిల్లకి దృష్టి సోకింది.. వెంటనే దిష్టి తీసేయాలి'' అన్నారావిడ.

''అదంతా చాదస్తంలే మామ్మగారూ'' అన్నాను.

''ఇదిగో అబ్బాయి.. మీరెంత చదువుకున్నా అన్నిటినీ తీసిపారేయొద్దు.. మన పెద్దవాళ్ళు ఏదీ ఊరికే చెప్పలేదు...'' అని నన్ను సుతిమెత్తగా మందలించి, మా ఆవిడని ఉద్దేశించి ''అమ్మాయి, కొంచెం ఉప్పు తీసుకురా'' అంటూ పురమాయించింది.

ఆవిడ ఉప్పు తెచ్చివ్వగా, మామ్మగారు ఏదో చదువుతూ శ్వేతకు దిష్టి తీసింది.

ఎంత ఆశ్చర్యం అంటే... మాయ చేసేనట్లు, మంత్రమేసినట్లు శ్వేత వెంటనే ఏడుపు ఆపేసింది. కిలకిలా నవ్వుతూ టేబుల్ మీదున్న పాలగ్లాసు కావాలంటూ చూపింది. పాలు గటగటా తాగేసి కాసేపట్లోనే హాయిగా నిద్రలోకి జారుకుంది.

మామ్మగారు బోసినవ్వులు నవ్వుతూ దృష్టి సోకడం గురించి అనర్గళంగా చెప్పుకొచ్చారు. ''నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగుల్తాయట.. కొన్ని కళ్ళు బొత్తిగా మంచివి కావు, అలాంటివారి చూపు పడితే ఇలాగే అవుతుంది, ముఖ్యంగా పిల్లలమీద ఆ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఉప్పు, మిరపకాయలు, చీపురుకట్ట మొదలైనవాటితో దిష్టి తీసేయాలి'' అంటూ వివరించారు.

అది మొదలు దిష్టి తగలడం చాదస్తం కాదని అర్ధమైంది. మా అమ్మాయి కొంచెం అందంగా అలంకరించుకుని బయటకు వెళ్ళి వస్తే మా ఆవిడ ఇప్పటికీ దిష్టి తీస్తుంది.

24, జూన్ 2012, ఆదివారం

ఈ పేరు ఎందుకంటే

హాయ్
ఏలా ఉన్నారు? అందరికీ ఈ   సింగినాదం  జీలకర్ర అని ఎందుకు అంటారో తెలిసి ఉండదేమో అనుకుంటున్నాను అందుకే నాకు తెలిసింది మీకూ చెప్తున్నాను .ఏమిటంటే
పూర్వం మన మసాలాలు ఉంటవి కదండీ అవి మన దేశం లో ఉండేవి కాదంట అవి ఫ్రెంచ్ వారు తెచ్చి అమ్మేవారట .వారికీ మన దేశం లోని వివిధ భాష లు  తెలియదు  కదండీ అందుకని వారు ఒక వాయిద్యాన్ని తెచ్చికునే వారట దాని పేరు  ఏమిటంటే శ్రుంఖo   .ఆ వాయిద్యం  ఆశబ్దం న్నీ నాదం అంటారు.దీని    ద్వార వారు ప్రజలకు తెలియ చేసేవారట మసాలాలు తెచ్చాము అని.అల వాటిలో జిలకర్ర కూడా ఉంటుంది కదా ,మన వాళ్లకేమో కాలక్రమం లో శ్రుంఖ  నాదం జీలకర్ర  కాస్తా సింగినాదం జీలకర్ర అయ్యిందట బాగుంది  కదండీ .సరే ఫ్రెండ్స్ ఈ పోస్ట్ నచ్చు తుంది  అనుకుంటున్నాను సెలవు మరి .