29, సెప్టెంబర్ 2016, గురువారం

యోగా ప్రజల్లో కి

హాయ్ !    
అవునండి యోగా ప్రజల్లోకి వెళ్ళాలిసినంతగా వెళ్ళలేదు అనిపిస్తుంది.పట్టణ ప్రజలు కొంత అవగాహన తో అదో నిత్య కృత్యంగా చేసుకున్నారు .కానీ చిన్న చిన్న పల్లె టూర్లల్లో అందరికి తెలియదు తెలిసిన అవకాశాలు తక్కువ .చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా మందులు వాడుకుంటూ శరీరాన్ని మందులకు అలవాటు చేస్తున్నారు 35 సంవత్సరాలకే బీపీ షుగర్ ఇలా వ్యాధుల బారిన పడుతున్నారు . వీటి అన్నింటిని కొంతవరకు యోగా  తో కంట్రోల్ చేయవచ్చు కదా.కానీ వారికీ నేర్పించే వాళ్ళు తక్కువ ఊర్లలో ప్రభుత్వం కూడా యోగా గురించి బాగా చెప్తుంది .ఇంకా కొంచెం చొరవ తో ప్రతి ఊరికి  లేదా రెండు ప్రక్క ప్రక్క ఊర్లకి కలిపి ఒక యోగా  ట్రైనర్ ని వేస్తె బావుంటుంది ప్రజల్లో కొంతమేరకు అవగాహన ఉంది కనుక త్వరగా స్పందిస్తారు కొంత ఐనా మేలు జరుగుతుంది. అనుకుంటూ ఇక సెలవు

28, సెప్టెంబర్ 2016, బుధవారం

నగర వాసం

హాయ్ మనం ఈ మధ్య కాలంలో అందరు ఉద్యోగం పేరు తో నగరంలోనే ఉంటున్నారు ఉద్యోగం లేని వారు వ్యాపారం పేరు తో వారు ఉన్న ఊరు నీ అయిన వారిని వదిలి దూరంగా వచ్చేస్తున్నారు.మిగిలిన పెద్దవారు మాత్రమే అక్కడ వుండి పోతున్నారు .ఇలాగె ఐతే ల్
కొన్ని రోజుల్లో పల్లెటూర్ల న్ని వెలితిగా మిగిలి పోతాయి కదా గాంధీ గారు చెప్పిన "పల్లెటూర్ల దేశానికి పట్టుకొమ్మలు"ఎలా అవుతాయి ఒక 50 year's కి ఊరు ఉండదేమో అనిపిస్తోంది .ఇది ఇలా ఉంటె నగర జీవితం ఎమన్నా బావుంటుందా ఉరుకుల పరుగుల జీవితాలు ఉదయం లేచిన దగ్గరి నుంచి అంతా యాంత్రికత.కనీసం పక్క ఇంట్లో ఎవరు ఉన్నారో ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి ఎమన్నా జరిగిన యూరు చూడరు ఎవరికి తెలియదు సమయం అంతా తలుపు వేసుకుని ఇంట్లొ కూర్చోవటమే ఇంట్లో ఉండే ఇల్లాలు పరిస్థితి దారుణం ప్రొద్దుట ఆఫీస్ కి వెళ్ళిన భర్త పిల్లలు వస్తేనే మరలా పలకరించే మనిషీ తనకి.ఇది నగర జీవితం అదే ఊరిలో ఉంటె సాయంత్రానికి అందరు ఒకచోట కలిసి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు.ఐతే అక్కడ ఉండే ఇబ్బంది అక్కడ ఉంటుంది కానీ. అవసరానికి  అందరు ఉంటారు ఏదయినా మన ఊరు మన వారు ఉంటేనే ఆనందం