మన దేశం లో వ్యవసాయం అంటే ఒక అబిమానం ఉండేది పాతరోజుల్లో కానీ ఇ ప్పుడు వారు అనుభవించే బాధ అంత ఇంతా కాదు ,వారికీ వాతావరణం సహకరించదు ఒక వేల వాతావరణం సహకరించిన కూడా మన ప్రభుత్వాలూ సహకరించవు వారికీ .ఈ రోజుల్లో వ్యవసాయం చేయటం ఎంతో కష్టం అంటున్నాడు కిసాన్ .కానీ ఎవరు అంటారండి వారె లేకపోతే మనం తింటున్న ఎ వస్తువు మన ఇంటి వరకు రాదు అని .వారు లేకపోతే మన కంప్యూటర్స్ కానీ మన ఆఫీసు లు కానీ డబ్బులు ఇస్తారు కానీ ఆహారం పెట్టారు కదండీ కిసాన్ పండిస్తేనే మనం పట్టణాలలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని పని చేయటానికి ఆవతుంది కానీ అ గుర్తిపు వారికేది అ మర్యాద మనం వారికీ ఇస్తున్నామా ఏమో మరి .ఈ మద్య ఒకసారి వార్తల్లో టీవీ లో చెప్పారు చిత్తూర్ లో వ్యవసాయం చేసే అబ్బాయి ల కి పిల్లని ఇవ్వటం లేదు అని ఎంత చిన్నచుపో చుడండి. అక్కడ ఒక్క చోటే కాదు అన్ని జిల్లా లలో అదే పరిస్థితి వారి జీవనం కష్టం అంటున్నారు జనతా. ఎవరు దీనికి భాద్యులు ఏమో కాలమా లేక మారుతున్నా జీవన విదానాల . దీనికి పరిష్కారం ఎలా .కనీసం మనం వారిని వారి పనిని గుర్తి ఇద్దాం ఎవరికీ అన్నా వారు తీసిపోరు అంటూ పయనిద్దాం
" అన్నదాత సుఖి భవ "
" అన్నదాత సుఖి భవ "