నమస్కారం అందరికి ఎలా ఉన్నారు.నేను బావున్నాను ఈరోజు ఒక చిన్న సరాదా విషయం పంచుకుంటాను మీతో.ఇప్పుడు పుడ్ ఎక్కువ బయట తినటం బాగా అలవాటు అవుతుంది అందరికీ ఇంతకముందు ఏ షాపింగ్ కో హాస్పటిల్ కో వెళ్ళినప్పుడు అక్కడ టైమ్ పడుతుంది కాబట్టి పక్కనే ఉన్న హోటల్ కి వెళ్లి తినేవారు కానీ ఇప్పుడు రోజూ సర్వ సాధరణమైపోయింది బయట భోజనం చేయడం. నేనూ బెంగళూరు లో ఉన్నప్పుడు మేము ఒకసారి లక్ష్మి హాస్పటిల్ కి వెళ్ళాము.ఇంకా చెప్పేది ఏముంది అనుకున్న టైమ్ కి బయటకీ రాము కదా అక్కడ వెళ్ళటం వరకే మన పని రావటం వాళ్ల పని కదా ....అల ఉండగా ఈలోపు మ బుజ్జి గాల్ల దెబ్బ కి నాకేమో ఆకలేస్తుంది మావారిని ఏమండీ ఆకలేస్తూంది అంటే మా వారు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు అడుగుతాన ఎందుకంటే అక్కడ మ వారి ఇష్టమైన హొటల్ ఉంది ఆ సంగతి నాకు తెలియదు మరి.ఇక నేను అడిగిందే తడవు గా వెళ్లి అక్కడ స్పెషల్ అయిన ఇడ్లీ,పొంగల్,ఉప్మా కొంచెం తెచ్చారు మనకేమో దోశ,పూరి కావాలి అక్కడ ఏమో లేవు. మా వారు ఏమో ఇక్కడ చాలా బావుంటాయి టేస్ట్ చూసి తరువాత చెప్పు నీకు నచ్చక పోతే వేరే తెస్తాను అంటారు . సరే అని తిన్నాను అండి అసలు చాలా బావున్నాయి ముందే ఒప్పుకోకుడడదు కదా ఏదో అల ఉన్నాయి లే ఇడ్లి ఇప్పుడు పోంగల్ తింట అని అది తిన్నాను అది కూడా సూపర్ ఉంది అండి ఇక పోతే ఉప్మా అది ఏముంటుంది లే అనుకున్న ఐతే అది కూడా సూపర్ అండి ఇక మన డాంబికం పక్కన పెట్టి ఎక్కడ తెచ్చారు అన్నాను తను నవ్వి ""వీణా స్టోర్ "" అన్నారు అక్కడ కేవలం ఇ మూడు రకాలు మాత్రమే ఉంటాయి.దోశ మాత్రం వారాంతం లో మాత్రమే ఉంటుంది అట. మరియు ప్రొద్దుటే 7 నుంచి 10:30 వరకు మాత్రం ఒపెన్ ఉంటుంది అది కూడా కూర్చోవటం లేదు తీసుకొని వెళ్లిపోవాలి.ఎంత పెద్ద క్యూ కడుతున్నారో జనాలు.చాలా చిన్న షాప్ చూడటానికి కానీ వ్యాపారం మాత్రం చాలా ఉంది ఆలాగే క్వాలిటీ ఉంది . దీనికి మనం మాత్రమే కాదండోయ్ పెద్ద పెద్ద వారు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అండి దీపిక పదుకునే,లాంటి వారు కూడా బెంగళూరు వస్తే తప్పక తినే ఉపహర హోటల్స్ లో ఇది ఒకటి అని అవిడ చెప్తుంటే విన్నాను టీవీ లో. ఇది అండి విషయం మీకు అవకాశం వస్టే ట్రై చేయడం ఒకసారి.ఇక సెలవు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి