18, అక్టోబర్ 2012, గురువారం

వయస్సు మార్పు భారం

హాయ్ 
ఈరోజు నేను ఒక సినిమా  చూసాను హిందీ లో bhagban  అదేనండి తెలుగులో బడి పంతులు మన ఎన్టీఆర్ గారి సినిమా హిందీ లో అమితాబ్ నటించారు ఏముందండి movie ,అతను తన నలుగురు పిల్లల్ని పెంచుతూ మరల ఒక అనాధ ను కూడా పెంచుతారు నిజంగా అనిపిస్తుంది మనం కూడా అలా  చేయగలిగితే ఎంత బావుంటది అని .ఈ  సినిమా లో ఇప్పుడు బయట మనం చూస్తున్న ఒక సమస్య కనబడుతుంది తల్లి తండ్రులు సంతానాన్ని పెంచే టప్పుడు ఎటువంటి బేదం తెలియకుండా వారి కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారు వీల్లే జీవితం అనుకుంటారు వారి కోసం ఏమి ఆలోచించకోకుండా జీవితం మొత్తం  వీళ్ళ కోసమే బ్రతుకుతారు .వాళ్ళ కోసం వాళ్ళకి టైం వచ్చి నప్పుడు పిల్లలు మాత్రం అ ప్రేమ అ మర్యాద ఇవ్వగలుగుతున్నారా ఏమో అనే అనాలి వయసు మీరిన ఎంతో మంది పెద్దవారు వారి పిల్లల నుంచి ఎన్నో చీదరింపు లు చిత్కారాలు ఎదుర్కుంటున్నారు తల్లి తండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు ఏమి లాభం ఆశిస్తున్నారు ఏమి లేదు కానీ పిల్లలు వారినే చూసే సమయం వచ్చినప్పుడు ఏమి యిస్తారు అని అడుగుతారు ఏంటో ప్రపంచం ఎంతోమంది తల్లి తండ్రులు వృద్ద ఆశ్రమాలలో ఉంటున్నారు వయసు మీరిన సమయం లో . ఏమి పిల్లల్ని పెంచే టప్పుడు  పెద్దవారు  కూడా అనుకోవచ్చు  కదా మాకు అడ్డం so పిల్లలని అనాధ ఆశ్రమం వేరే దగ్గర వదలి వేద్దాం అని offcourse ఇప్పుడు అందరు బేబీ కేర్ సెంటర్స్ లో వదులుతున్నారు జాబు కోసం కానీ పాత రోజులు వేరు ఎంతో కష్ట పడి  పెంచుతారు కాని మనం కన్న వారి మీద చూపించే ప్రేమ మనల్ని కన్నా వారి మీద చూపలేక పోతున్నాం. అందుకే పెద్దవారు మీ  కోసం కూడా కొంచెం దాచుకోండి ఏది అయిన డబ్బు లేక ఆస్తి . సమయం, అంత ఎప్పుడు ఎలాఉంటుందో తెలియదు .ఎవరు అయినా పెద్దలు పెద్దతనం లో పిల్లల సహచర్యం ప్రేమ మర్యాద మాత్రమే కోరుకుంటారు  అది మనం ఇవ్వాలి వారికీ. రేపు మనం కూడా అ స్థితి కి వస్తాం.అని భావిస్తాను నేను bye 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి